
WHO WE ARE. మేము ఎవరం
ధర్మ పరిరక్షణకు... మానవ సేవకు... అంకితమైన ఒక సేవా సంస్థ
శ్రీం కాళికా దేవి ట్రస్టు, కరీణ్ణగరము ఒక లాభాపేక్షలేని ధార్మిక, సేవా మరియు సామాజిక ట్రస్టు. సనాతన ధర్మ పరిరక్షణ, పురాతన దేవాలయాల సంరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణ మరియు సమాజ సంక్షేమం మా స్థాపనకు మూలాధారాలు.
మా ట్రస్టు ప్రజల సహకారంతో చారిత్రక దేవాలయాల పునరుద్ధరణ, ఆధ్యాత్మిక చైతన్య వికాసం మరియు సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా రామంచ ప్రాంతంలోని ప్రాచీన శ్రీ పంచభూతేశ్వర (శివ) ఆలయం మరియు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వంటి వారసత్వ దేవాలయాల పరిరక్షణ మరియు అభివృద్ధి మా ప్రధాన లక్ష్యాలలో ఒకటి.
దేవాలయ అభివృద్ధితో పాటు గోసంరక్షణ, అన్నదాన సేవ, విద్యా సహాయం, ఉచిత ఆరోగ్య శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం మరియు వివిధ ప్రజాహిత కార్యక్రమాలను పారదర్శకంగా, నిస్వార్థంగా నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాము.
మా ప్రతి కార్యక్రమం "సేవే పరమో ధర్మః" అనే భావనతో, సమాజ శ్రేయస్సు మరియు భావి తరాలకు భారతీయ వారసత్వాన్ని అందించే సంకల్పంతో కొనసాగుతుంది.

